జ్ఞాపకాలు గతాన్ని
తట్టి లేపుతున్నపుడు
హ్రుదయాంతరంగాన్ని
ఎగిసిపడే అలలు తాకుతున్నపుడు
గతపు ఆనందాల్లోంచి
అనుభూతుల రసానందస్ఫూర్తి
వర్తమాన అల్లకల్లొలపు తుఫాను లోంచి
భవిష్యత్ నందుకునే పసిపాప కోసం
అంతరంగపు మధనం మీద
జ్ఞాపకాలు రేగకుండా
పాలరాతి కట్టడం కట్టేశా
ఫాలనేత్రం తెరిచి
పరికించి చూశా
నాకునేనే చెయూతగా
వడివడిగా అదుగెస్తున్న నన్ను
తనూ అనుసరించింది కొంత ప్రజ
కాలానికంటె ముందు నాతో నడవాలని
వెర్రిగా చుసింది కొంత ప్రజ
వర్తమానానికి బానిసై
కాలానికి పది కాలాలు వెనకే ఉంటామని
ముందుకెల్ళే వాల్ళని
వెక్కిరిస్తూనే
అయినా
రెపటి కలల విత్తుల్ని వెదజల్లుతూ
ఆనందపు పూ తొటలో
గంతులేస్తూ
నన్ననుసరించే ఒకరిద్దరే చాలు
మరో ప్రభంజనానికి చెయూతగా
ఆశయాల పూలు మూడైతే
నా కలలపంటలారు కాయలై
యీ విశ్వం అంతటా సస్య శ్యామలం కావాలి
నాలోని ఈ చైతన్య స్పర్శ
దిగ్దిగంతాల్లో
కీర్తి రాగాల సుగంధాల్ని కురిపించాలి
ఆ సుగంధాస్వాదన కైనా
సమస్తప్రజా
నాతోనే నడవాలి
Saturday, October 11, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
chala baagundi.
thanks for the compliment
Post a Comment