యెన్నాళ్ళనుంచో
నిన్ను చూడాలనే ఆశ
యీ దినం నిన్ను
చూడగలిగాననే త్రుప్తి
రేపు నిన్నువీడి
మనలేనెమో అన్న భయం
వీటిమధ్య
కొట్టుమిట్టాడుతున్నాం మనం
Tuesday, October 28, 2008
మనిషి
ఈ చలికి తట్టుకోలేక రాళ్ళు
మంచుదుప్పటే
కప్పుకున్నై
ఈ వాన ఉధ్రుతి చూచి
ప్రతితరువూ
ఆనందంతో
తలలూస్తొంది
ఈ ఎండ వేడికి తాళలేక
పురుగు, పుట్రా సైతం
సమైక్యంగా దాగి
చల్లని సాయంకాలనికై
ఎదురు చూస్తున్నై
స్వార్థపు దుప్పటీ కప్పుకుని
కుటిలపు ఆలొచనలతో
క్రుతిమపు చల్లదనంలో
విక్రుత మైన ఊహలలో
చల్లని సాయంత్రాన్ని సైతం
మరిచే పొయాడు మనిషి
జయభారతి సుసర్ల
మంచుదుప్పటే
కప్పుకున్నై
ఈ వాన ఉధ్రుతి చూచి
ప్రతితరువూ
ఆనందంతో
తలలూస్తొంది
ఈ ఎండ వేడికి తాళలేక
పురుగు, పుట్రా సైతం
సమైక్యంగా దాగి
చల్లని సాయంకాలనికై
ఎదురు చూస్తున్నై
స్వార్థపు దుప్పటీ కప్పుకుని
కుటిలపు ఆలొచనలతో
క్రుతిమపు చల్లదనంలో
విక్రుత మైన ఊహలలో
చల్లని సాయంత్రాన్ని సైతం
మరిచే పొయాడు మనిషి
జయభారతి సుసర్ల
Saturday, October 25, 2008
తేడా !
లైలా మజ్ఞూల్ని చుళ్ళేదెవరూ
అనార్కలీ ,సలీంలనూ చుళ్ళేదెవరూ
వాళ్ళని గూర్చి
గొప్పలు చెప్పె వీళ్ళే
మనల్ని చూసి
కళ్ళలో నిప్పులు పోసుకున్నారు
వాళ్లని పొగిడిన నోళ్ళ తో
మనల్ని ఆడిపోసుకున్నారు
వాళ్ళ దీ మనదీ
రెండూ ప్రేమలే ?
పోతే
మన ప్రేమకి వీళ్ళే
సమాధి కడుతున్నారు ?????????????????????????
అనార్కలీ ,సలీంలనూ చుళ్ళేదెవరూ
వాళ్ళని గూర్చి
గొప్పలు చెప్పె వీళ్ళే
మనల్ని చూసి
కళ్ళలో నిప్పులు పోసుకున్నారు
వాళ్లని పొగిడిన నోళ్ళ తో
మనల్ని ఆడిపోసుకున్నారు
వాళ్ళ దీ మనదీ
రెండూ ప్రేమలే ?
పోతే
మన ప్రేమకి వీళ్ళే
సమాధి కడుతున్నారు ?????????????????????????
దూరం ?
నాకూ నీకూ మధ్య నిజ మెంత దూరం !
డబ్బు వ్యామొహం లో
అహర్నిశలూ డబ్బు చుట్టె లొకం అన్న నిన్ను
అర్థం చెసుకోలేని పిచ్చి దాన్ని
గిడసబారిన హ్రుదయాన్ని
సమాజ అమోదం కోసం జీవితాన్నిస్తా నంటే
యెన్నటికీ తీరదనుకున్న కోరిక చంపుకో లెక,
దేహసీమకి పట్టిన స్నెహ దారిద్ర్యానివి నువ్వని
అర్థం చెసుకో లేక
నాకు నేనే ఒదిగి అర్పించుకున్న
సహజీవన గాంధర్వ జీవనాన్ని
నిర్దయగా చిన్నభిన్నం చేయగలిగిన
నీ కఠిన వ్యాపార ద్రుష్టి ని తట్టుకోలెక
విలవిల లాడి పోయాన్నేను
మానవత్వపు డోలిక లో
హయిగా సేద తీరాలనుకున్ననే కానీ నువ్వాడిన ప్రేమ నాటకం లో
కొవ్వెక్కి నన్ను నేను దగ్ధం చెసుకొలేదని
నువ్వు గ్రహించే లోగా
ఎన్నటికీ జీవితంలో తీరదనుకున్న చిన్న సరదా సైతం తీరదని తెల్సుకున్నాక
నిత్యం అసంత్రుప్తి తో కాలే
మరో శలభాన్ని నే కాదలుచుకొలేక
నీలాంటి నపునంసకుల ప్రేమ కోసం
హ్రుదయాలకొద్ది కన్నీళ్ళు చేదుకొని
వ్యర్ధంగా బ్రతుకుని వట్టి బోనివ్వలేక
సెక్క్యుర్డ్ జీవితపు జిలుగు ప్రలొభానికి
మొగ్గిపోయినందుకు
నన్ను నెనే క్షమించుకోలెక
నన్ను నేనే తరుముకుంటున్నాను
విముఖత్యం వైపు, విపరీత వాదాల వైపు
ఇజాల వైపు
(ప్రాణం పొయినా ఇంకా నా అలోచనల్లో సజీవం గా ఉన్న సరళ కోసం0)
డబ్బు వ్యామొహం లో
అహర్నిశలూ డబ్బు చుట్టె లొకం అన్న నిన్ను
అర్థం చెసుకోలేని పిచ్చి దాన్ని
గిడసబారిన హ్రుదయాన్ని
సమాజ అమోదం కోసం జీవితాన్నిస్తా నంటే
యెన్నటికీ తీరదనుకున్న కోరిక చంపుకో లెక,
దేహసీమకి పట్టిన స్నెహ దారిద్ర్యానివి నువ్వని
అర్థం చెసుకో లేక
నాకు నేనే ఒదిగి అర్పించుకున్న
సహజీవన గాంధర్వ జీవనాన్ని
నిర్దయగా చిన్నభిన్నం చేయగలిగిన
నీ కఠిన వ్యాపార ద్రుష్టి ని తట్టుకోలెక
విలవిల లాడి పోయాన్నేను
మానవత్వపు డోలిక లో
హయిగా సేద తీరాలనుకున్ననే కానీ నువ్వాడిన ప్రేమ నాటకం లో
కొవ్వెక్కి నన్ను నేను దగ్ధం చెసుకొలేదని
నువ్వు గ్రహించే లోగా
ఎన్నటికీ జీవితంలో తీరదనుకున్న చిన్న సరదా సైతం తీరదని తెల్సుకున్నాక
నిత్యం అసంత్రుప్తి తో కాలే
మరో శలభాన్ని నే కాదలుచుకొలేక
నీలాంటి నపునంసకుల ప్రేమ కోసం
హ్రుదయాలకొద్ది కన్నీళ్ళు చేదుకొని
వ్యర్ధంగా బ్రతుకుని వట్టి బోనివ్వలేక
సెక్క్యుర్డ్ జీవితపు జిలుగు ప్రలొభానికి
మొగ్గిపోయినందుకు
నన్ను నెనే క్షమించుకోలెక
నన్ను నేనే తరుముకుంటున్నాను
విముఖత్యం వైపు, విపరీత వాదాల వైపు
ఇజాల వైపు
(ప్రాణం పొయినా ఇంకా నా అలోచనల్లో సజీవం గా ఉన్న సరళ కోసం0)
స్వేఛ్ఛా జీవి
ఆకాశం లో యెగిరే
విహంగాన్ని నేను
దేన్ని యెవరాపదలచినా
నా పయనం ఆగదు.
పారిపోతున్న సూరీణ్ణి
వెంటాడే రాత్రినీ
బంధించలేనినాడు
గుండెగడియారపు చప్పుళ్ళు
ఆగిపోయినా
గోడ గడియారపు బాహువులు
కాలాన్ని బంధిస్తాయి
అప్పుడూ నేను ఎగురుతూనే ఉంటాను
సూర్యునికి దగ్గరగా- వేడిలో
చంద్రునికి దగ్గరగా- శిశిరపు వొడిలో
గలగల పారే సెలయేటిని
ఆనకట్టలు ఆపినా
అంతెత్తునుంచి దుమికే
జలపాతపు నాలుకల్ని
గ్రీష్మం మింగేసినా
పాత బానిసత్వాలు రాలిపోయి
క్రొత్త నిరాశా నిస్పృహలు చేరువైనా
నిరంతరం ఎగురుతూనే ఉంటాన్నేను
దేనికీ క్రుంగిపోవద్దనీ
దేనికిలొంగిపోవద్దనీ
సందేశపు ఝండా పట్టుకుని
చైతన్యాన్ని బోధిస్తూ
స్వేఛ్ఛగా రెప రెప లాడుతుంటాన్నెను.
విహంగాన్ని నేను
దేన్ని యెవరాపదలచినా
నా పయనం ఆగదు.
పారిపోతున్న సూరీణ్ణి
వెంటాడే రాత్రినీ
బంధించలేనినాడు
గుండెగడియారపు చప్పుళ్ళు
ఆగిపోయినా
గోడ గడియారపు బాహువులు
కాలాన్ని బంధిస్తాయి
అప్పుడూ నేను ఎగురుతూనే ఉంటాను
సూర్యునికి దగ్గరగా- వేడిలో
చంద్రునికి దగ్గరగా- శిశిరపు వొడిలో
గలగల పారే సెలయేటిని
ఆనకట్టలు ఆపినా
అంతెత్తునుంచి దుమికే
జలపాతపు నాలుకల్ని
గ్రీష్మం మింగేసినా
పాత బానిసత్వాలు రాలిపోయి
క్రొత్త నిరాశా నిస్పృహలు చేరువైనా
నిరంతరం ఎగురుతూనే ఉంటాన్నేను
దేనికీ క్రుంగిపోవద్దనీ
దేనికిలొంగిపోవద్దనీ
సందేశపు ఝండా పట్టుకుని
చైతన్యాన్ని బోధిస్తూ
స్వేఛ్ఛగా రెప రెప లాడుతుంటాన్నెను.
Saturday, October 11, 2008
ముందడుగు.
జ్ఞాపకాలు గతాన్ని
తట్టి లేపుతున్నపుడు
హ్రుదయాంతరంగాన్ని
ఎగిసిపడే అలలు తాకుతున్నపుడు
గతపు ఆనందాల్లోంచి
అనుభూతుల రసానందస్ఫూర్తి
వర్తమాన అల్లకల్లొలపు తుఫాను లోంచి
భవిష్యత్ నందుకునే పసిపాప కోసం
అంతరంగపు మధనం మీద
జ్ఞాపకాలు రేగకుండా
పాలరాతి కట్టడం కట్టేశా
ఫాలనేత్రం తెరిచి
పరికించి చూశా
నాకునేనే చెయూతగా
వడివడిగా అదుగెస్తున్న నన్ను
తనూ అనుసరించింది కొంత ప్రజ
కాలానికంటె ముందు నాతో నడవాలని
వెర్రిగా చుసింది కొంత ప్రజ
వర్తమానానికి బానిసై
కాలానికి పది కాలాలు వెనకే ఉంటామని
ముందుకెల్ళే వాల్ళని
వెక్కిరిస్తూనే
అయినా
రెపటి కలల విత్తుల్ని వెదజల్లుతూ
ఆనందపు పూ తొటలో
గంతులేస్తూ
నన్ననుసరించే ఒకరిద్దరే చాలు
మరో ప్రభంజనానికి చెయూతగా
ఆశయాల పూలు మూడైతే
నా కలలపంటలారు కాయలై
యీ విశ్వం అంతటా సస్య శ్యామలం కావాలి
నాలోని ఈ చైతన్య స్పర్శ
దిగ్దిగంతాల్లో
కీర్తి రాగాల సుగంధాల్ని కురిపించాలి
ఆ సుగంధాస్వాదన కైనా
సమస్తప్రజా
నాతోనే నడవాలి
తట్టి లేపుతున్నపుడు
హ్రుదయాంతరంగాన్ని
ఎగిసిపడే అలలు తాకుతున్నపుడు
గతపు ఆనందాల్లోంచి
అనుభూతుల రసానందస్ఫూర్తి
వర్తమాన అల్లకల్లొలపు తుఫాను లోంచి
భవిష్యత్ నందుకునే పసిపాప కోసం
అంతరంగపు మధనం మీద
జ్ఞాపకాలు రేగకుండా
పాలరాతి కట్టడం కట్టేశా
ఫాలనేత్రం తెరిచి
పరికించి చూశా
నాకునేనే చెయూతగా
వడివడిగా అదుగెస్తున్న నన్ను
తనూ అనుసరించింది కొంత ప్రజ
కాలానికంటె ముందు నాతో నడవాలని
వెర్రిగా చుసింది కొంత ప్రజ
వర్తమానానికి బానిసై
కాలానికి పది కాలాలు వెనకే ఉంటామని
ముందుకెల్ళే వాల్ళని
వెక్కిరిస్తూనే
అయినా
రెపటి కలల విత్తుల్ని వెదజల్లుతూ
ఆనందపు పూ తొటలో
గంతులేస్తూ
నన్ననుసరించే ఒకరిద్దరే చాలు
మరో ప్రభంజనానికి చెయూతగా
ఆశయాల పూలు మూడైతే
నా కలలపంటలారు కాయలై
యీ విశ్వం అంతటా సస్య శ్యామలం కావాలి
నాలోని ఈ చైతన్య స్పర్శ
దిగ్దిగంతాల్లో
కీర్తి రాగాల సుగంధాల్ని కురిపించాలి
ఆ సుగంధాస్వాదన కైనా
సమస్తప్రజా
నాతోనే నడవాలి
Subscribe to:
Comments (Atom)