Sunday, October 2, 2011

అమ్మదొంగా


   నాకు ఎప్పుడూ నిన్ను ప్రేమించడమే తెలుసు
   ద్వేషించడం తెలీదు
  
  నిన్ను నాలో పొదుగు కోవడమేతెలుసు 
  ఎలా వదిలేయాలో తెలీదు.
  

 నీ నుoడి ఎలా దూరంగా ఉండాలో తెలీదు,నీతో నే తప్ప 
  
  నిన్నెంత ప్రేమిస్తున్నానో నాకు మాత్రమె తెలుసు
  కానీ ఎలా రుజువు చేసుకోవాలో తెలీదు 
 నిన్ను అనుక్షణం తలచు కోవడమే తెలుసు
నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో తెలీదు
చిన్న తల్లీ , నువ్వు అమ్మ వైతే నేనేంటో
అప్పుడైనా తెలుస్తుందేమో